Love Me | ఆశిష్ లవ్ మీ సీక్వెల్ ఆన్ ది వే.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
Love Me | టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ (Ashish) నటిస్తోన్న హార్రర్ లవ్ థ్రిల్లర్ ‘లవ్మీ’ (Love Me Trailer). అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న లవ్ మీ మే 25న థియేటర్లలో సందడి చేయనుంది.
Love Me | టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ (Ashish) నటిస్తోన్న హార్రర్ లవ్ థ్రిల్లర్ ‘లవ్మీ’ (Love Me Trailer). అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ‘ఇఫ్ యు డేర్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. బేబి ఫేం వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. లవ్ మీ మే 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
లవ్ మీకి సీక్వెల్ కూడా ఉందని మూవీ లవర్స్‌లో మరింత జోష్ నింపాడు డైరెక్టర్. అంతేకాదు షూటింగ్ కూడా త్వరలోనే షురూ కానున్నట్టు చెప్పాడు. ఆశిష్ మరోసారి హీరోగా నటించనున్నాడు. సీక్వెల్ కిల్ మీ ఇఫ్ యు లవ్ టైటిల్‌తో తెరకెక్కనున్నట్టు సమాచారం. లవ్ మీ సక్సెస్‌పై ధీమాగా ఉన్న మేకర్స్ అంతే కాన్ఫిడెంట్‌గా సీక్వెల్ కూడా ప్రకటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
లవ్ మీ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగమల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానుగుణంగా దెయ్యం పాత్ర ఉండగా.. ఆ రోల్ ఎవరు పోషించారనేది మాత్రం ఇప్పటికే సస్పెన్స్‌లో పెట్టారు మేకర్స్. ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది..? ఏమవుతుంది..? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లున్నారని క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు ఆశిష్.
లవ్ మీ ట్రైలర్లో.. తనని చూస్తే నన్ను చంపేస్తుందేమో అని మీరు భయపడుతున్నారు..నన్ను చూశాక చంపకుండా వదిలేస్తుందేమో అని నేను భయపడ్తున్నాను.. అంటూ హీరో చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీకి పీసీ శ్రీరామ్ కెమెరామెన్ కాగా.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
లవ్ మీ ట్రైలర్..
లవ్ మీ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

