RC15 Movie | ‘RC15’ నుండి తప్పుకున్న ప్రముఖ టెక్నీషియన్
Shankar-Ramcharan Movie | ఇండియా గర్వించ దగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. శంకర్ తన సినిమాల్లో ఎంటర్టైనమెంట్తో పాటు ఒక మంచి సోషల్ మేసేజ్ కూడా ఇస్తుంటాడు. ఇక ప్రస్తుతం ఈయన రామ్‌చరణ్‌తో ‘RC15’ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో శంకర్ RC 15పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇక శంకర్ తన సినిమాల్లో టెక్నీషిన్లు ఎక్కువగా మార్చడు. కానీ ఈ సినిమాకు చాలా వరకు టెక్నీషిన్స్ను మార్చాడు.
ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా ‘రంగస్థలం’ సినిమాకు పనిచేసిన రామకృష్ణ పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఈ చిత్రానికి భారీ సెట్లను కూడా వేశాడు. కాగా తాజాగా రామకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. శంకర్‌కు, ఈయనకు మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడంతో సినిమా నుండి తప్పుకున్నాడట. కాగా ‘రాధేశ్యామ్’ సినిమాకు పనిచేసిన రవిందర్.. ఆర్ట్ డైరెక్టర్ ప్లేస్‌ను రిప్లేస్ చేస్తున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి లీకైన చరణ్ ఫోటోలకు విశేష స్పందన వచ్చింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరిష్ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

