Arjun Das | ఓజీ సెట్స్‌లో పవన్‌కల్యాణ్‌ను కలిసిన అర్జున్ దాస్.. ఫొటోలు వైరల్
Pawan Kalyan | టాలీవుడ్ కథానాయకుడు పవన్‌కల్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎంగా తన విధులు నిర్వర్తిస్తునే మరోవైపు సినిమాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. సాధ్యమైనంత తొందరలో తన సినిమాలను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు.
Arjun Das meets Pawan Kalyan | టాలీవుడ్ కథానాయకుడు పవన్‌కల్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎంగా తన విధులు నిర్వర్తిస్తునే మరోవైపు సినిమాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. సాధ్యమైనంత తొందరలో తన సినిమాలను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లును విడుదలకు సిద్ధం చేసిన పవన్ ప్రస్తుతం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్లో పాల్గోన్న అర్జున్ దాస్ తాజాగా పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
పవన్‌కల్యాణ్ గారూ, మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. మీతో పనిచేసిన ప్రతి రోజునూ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఎంత బిజీగా ఉన్నా, షూటింగ్ సమయంలో నా కోసం సమయం కేటాయించి నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మన సంభాషణలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. సర్, మీతో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ అర్జున్ దాస్ ఈ ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ రాసుకోచ్చాడు.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా సిద్ధమవుతోంది. బాలీవుడ్ కథానాయకుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా కనిపించనున్నారు. డీవీవీ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
It has been an absolute honour @PawanKalyan Garu. Will cherish every single day of working with you. Thank you for taking time out whenever we shot, to sit down & talk to me despite your extremely busy schedule. Will forever cherish our conversations. I truly hope I get to… pic.twitter.com/zBa7dhXf5j
— Arjun Das (@iam_arjundas) June 6, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

