వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ ఉపశీర్షిక. జయశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్నది. సోమవారం సినిమాలో కీలక పాత్ర పోషించిన సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
‘సోషియో ఫాంటసీ జోనర్లో వినూత్నమైన కథ ఇది. కథ, కథనాలు ఉత్కంఠను పంచుతాయి. ఈ సినిమా హిందీ రీమేక్‌పై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణప్రసాద్, శివశంకర వరప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, నిర్మాతలు: శ్రీనివాస్ రామిరెడ్డి, తిమప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి, సమర్పణ: ఆర్వీ రెడ్డి, రచన-దర్శకత్వం: జయశంకర్.