AR Rahman | ‘సీక్రెట్ మౌంటైన్ ప్రాజెక్ట్’ కోసం OpenAI సీఈఓని కలిసిన ఏ.ఆర్ రెహమాన్
AR Rahman | ప్రముఖ సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ తన "సీక్రెట్ మౌంటైన్ ప్రాజెక్ట్" కోసం OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను కలుసుకున్నాడు.
AR Rahman | ప్రముఖ సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ తన “సీక్రెట్ మౌంటైన్ ప్రాజెక్ట్” కోసం OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను కలుసుకున్నాడు. ఈ భేటీ గురించి రెహమాన్ తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఆల్ట్‌మన్ కార్యాలయంలో ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో తాము “సీక్రెట్ మౌంటైన్” అనే తమ వర్చువల్ గ్లోబల్ బ్యాండ్ గురించి చర్చించారని, అలాగే సంగీత రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై మాట్లాడినట్లు వెల్లడించారు. భారతదేశంలోని సృజనాత్మక మైండ్స్‌ను ప్రోత్సహించడానికి మరియు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి AI టూల్స్‌ను వినియోగించడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామ్ ఆల్ట్‌మన్‌తో దిగిన ఫోటోను కూడా ఏ.ఆర్. రెహమాన్ పంచుకున్నారు.
“సీక్రెట్ మౌంటైన్” అనేది ఏ.ఆర్. రెహమాన్ రూపొందించనున్న ఒక డిజిటల్, మల్టీమీడియా ప్రాజెక్ట్. ఇది “మెటా బ్యాండ్”ను కలిగి ఉంటుంది, ఇది సంగీతం, సాంకేతికతతో కలగలిసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావాలని రెహమాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
It was a pleasure meet @sama at his office …we discussed “Secret Mountain”, our virtual global band, and to empower and uplift Indian minds to use AI tools to address generational challenges and lead the way forward.
EPI
@chatgptindia @OpenAI #arrimmersiveentertainment… pic.twitter.com/ny16ogrqFk— A.R.Rahman (@arrahman) July 24, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

