R Narayanamurthy | ఈ మధ్య కాలంలో టీజర్, ట్రైలర్లతోనే వివాదాలతో పాటు సంచలనాలు సృష్టించిన చిత్రం ‘రజాకార్’. కోలీవుడ్ నటుడు బాబీ సింహా, అనసూయ అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించగా.. యాటా సత్యనారాయణ (Yata Satyanarayana) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకులు మందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా.. ఈ వేడుకలో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా గురించి వేదికపై ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతుండగా.. సభలో జైశ్రీరామ్ అంటూ పలువురు నినాదాలు చేశారు. దీంతో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. తమ్ముడు.. మాట్లాడితే జైశ్రీరామ్ అంటున్నావు.. శ్రీరాముడు ఒకరి అబ్బ సొత్తు కాదు అని ఫైర్ అయ్యారు. రాముడు బీజేపీ సంబంధించిన వ్యక్తి కాదు.. అందరికీ సంబంధించిన వ్యక్తి, నేను రాముని భక్తుడినే.. జైశ్రీరామ్, నేను హిందువునే అంటూ ఆర్ నారాయణ మూర్తి నినాదం చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
R. Narayana Murthy Sir🔥🫡 pic.twitter.com/azTrnwMixp
— Arshad (@Iamarshad46) March 14, 2024