అనుమతి లేకుండా మహిళను తాకడం నేరమని తెలియదా.. లా స్టూడెంట్ ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్
నేషనల్ అవార్డు గ్రహిత అపర్ణ బాలమురళికి తాజాగా చేదు సంఘటన ఎదురైంది. తను నటించిన 'తన్కమ్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఎర్నాకులంలోని ఓ ప్రభుత్వ లా కాలేజ్‌ను చిత్రయూనిట్ సందర్శించింది.
Aparna Balamurali | నేషనల్ అవార్డు గ్రహిత అపర్ణ బాలమురళికి తాజాగా చేదు సంఘటన ఎదురైంది. తను నటించిన ‘తన్కమ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఎర్నాకులంలోని ఓ ప్రభుత్వ లా కాలేజ్‌ను చిత్రయూనిట్ సందర్శించింది. ఈ క్రమంలో ఓ స్టూడెంట్ స్టేజీపైకి వచ్చి అపర్ణకు షేక్ హ్యండ్ ఇచ్చి, బలవంతంగా పైకి లేపాడు. అంతటితో ఆగకుండా తనతో ఫోటో దిగడానికి ఆమె భుజంపై చేయి వేశాడు. అభిమాని చేష్టలతో ఇబ్బందికరంగా ఫీలైన అపర్ణ అతని నుంచి మెల్లగా తప్పించుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోపై పలువురు సెలబ్రెటీలు ఇది చాలా అసభ్యకరం అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
తాజాగా ఆ ఘటనపై నటి అపర్ణ బాలమురళి స్పందించింది. ఈ ఘటన తనను చాలా బాధించిందని తెలిపింది. లా చదువుతున్న విద్యార్థి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమన్న విషయం తెలియదా? అంటూ తనపై మండిపడింది. బలవంతంగా తన చేయి పట్టుకొని కుర్చీలో నుండి పైకి లేపడం సరికాదని. తను భుజాలపై అతను చేతులు వేసేందుకు ప్రయత్నించాడని అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణలు చెప్పారని తెలిపింది. అందుకే దీన్ని ఇష్యూ చేయాలనుకోవడం లేదని చెప్పుకొచ్చింది.
‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ఈ బ్యూటీకి దక్షిణాదిన మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనకు నేషనల్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.
തോളില് കൈയ്യിടാന് ശ്രമം; അപര്ണ ബാലമുരളിയോട് മോശമായി പെരുമാറി വിദ്യാര്ഥി#AparnaBalamurali #vineethSreenivasan #Lawcollege pic.twitter.com/1EHgSioHXf
— OneIndia Malayalam (@thatsMalayalam) January 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

