Anushka – Ghaati | అనుష్క శెట్టి ‘ఘాటి’లో తమిళ నటుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
Anushka – Ghaati | అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఘాటి(Ghaati). ఈ సినిమాకు వేదం, కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. 4 ఏండ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.
Anushka – Ghaati | అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఘాటి(Ghaati). ఈ సినిమాకు వేదం, కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. 4 ఏండ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న పాత్రను పరిచయం చేసింది. ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీ రోల్ పోషిస్తుండగా ఆయన బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో విక్రమ్ దేసి రాజు అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాలో అనుష్క ట్రైబల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని కొండ లోయలలో నివసించే జీవితాల ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇందులో అనుష్క ఒక బాధితురాలి నుంచి క్రిమినల్‌గా, అనంతరం లెజెండ్‌గా ఎలా మారింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటూ మేకర్స్ తెలిపారు. ఇక కొండపోలం వంటి భారీ డిజాస్టార్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

