స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేమ్ ఫేమస్’. లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 2న విడుదలకానుంది. అనురాగ్ రెడ్డి, శరత్చంద్రు, మనోహరన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
‘గ్రామీణ నేపథ్య కథ ఇది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. షూటింగ్ తుది దశలో ఉందని నిర్మాత తెలిపారు. మణి, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దుపాటి, సంగీతం: కల్యాణ్ నాయక్, రచన-దర్శకత్వం: సుమంత్ ప్రభాస్.