Animal Movie | అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. నాన్ హాలీడేస్ (వీక్ డేస్) లోనూ హౌల్ఫుల్ షోస్‌తో ప్రదర్శితమౌతూ, కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ జంటగా రష్మిక మందన్నా నటించగా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, బాబీ డియోల్‌లు కీలక పాత్రలలో కనిపించారు.
రీసెంట్గా ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కేవలం 10 రోజులలో రూ.700 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఈ చిత్రం ఆదివారం నాడు రూ.717 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, 10వ రోజైన ఆదివారం ఒక్క హిందీలోనే రూ. 87.56 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ వీకెండ్ కూడా బాలీవుడ్లో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వెయ్యి కోట్లు వసూళ్లు చేయడం పక్కా అని తెలుస్తుంది.
#Animal Conquering Box Office with Thunderous Records 🔥✊
Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/6Izeug7H5Y
— Animal The Film (@AnimalTheFilm) December 11, 2023