Spirit Movie Casting Call | ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో నటించాలనుందా.. ఈ అవకాశం మీ కోసమే.!
Casting Call For Prabhas Spirit Movie | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు బంపరాఫర్. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో రాబోతున్న స్పిరిట్ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారిని ఆడిషన్స్‌కి పిలిచింది చిత్రబృందం.
Spirit Movie Team Announcement for Casting Call | అగ్ర కథానాయకుడు ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit). దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం.
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారిని డిజిటల్ ఆడిషన్స్‌కి పిలిచింది సందీప్ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ అయిన భద్రకాళీ పిక్చర్స్. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నామని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆడిషన్స్‌లో పాల్గోనవచ్చని తెలిపింది. అయితే ఆడిషన్స్‌లో పాల్గోనేవారు సినిమా లేదా థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు అయి ఉండాలని తెలిపింది. ఇక డిజిటల్ ఆడిషన్స్‌లో పాల్గోనేవారు ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫోటో కూడా జత చేయాలని కోరారు. ఇక ఇంట్రడక్షన్ వీడియోలో మీ పేరు ఇతర వివరాలు వెల్లడించడంతోపాటు మీ చదువుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని కోరారు. ఈ మేరకు వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని కోరారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియో పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
We’re calling all aspiring actors for an exciting casting opportunity in our film, “Spirit”. pic.twitter.com/DgLZ5kIvNO
— Bhadrakali Pictures (@VangaPictures) February 12, 2025
ఈ సినిమాలో ప్రభాస్ మూడు కొత్త లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా తరహాలో ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపించబోతున్నట్లు సమాచారం. ఆరునెలల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

