Anil Sunkara | అనిల్ సుంకరకు కలిసి రావడం లేదా.. రెండేళ్లలలో రెండొందల కోట్లకు పైగా నష్టాలు..!
Producer Anil Sunkara | దూకుడు, లెజెండ్, సరిలేరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నిర్మాతగా భాగమైన అనీల్ సుంకర ఇప్పుడు పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయాడు. గత రెండేళ్లలో మూడు అల్ట్రా డిజాస్టర్లతో దాదాపు రెండొందల కోట్లకు పైగా నష్టాల్ని వెనకేసుకున్నాడు.
Producer Anil Sunkara | దూకుడు, లెజెండ్, సరిలేరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నిర్మాతగా భాగమైన అనిల్ సుంకర ఇప్పుడు పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయాడు. గత రెండేళ్లలో మూడు అల్ట్రా డిజాస్టర్లతో దాదాపు రెండొందల కోట్లకు పైగా నష్టాల్ని వెనకేసుకున్నాడు. నిజానికి అనిల్ సుంకరకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమా కోసం ఎంత వరకైనా వెళ్తాడని, బడ్జెట్‌కు పరిధిలంటూ పెట్టుకోడని అంటుంటారు. ఇప్పుడదే తన కొంప ముంచింది. లెక్కలేసుకోకుండా తీసిన సినిమాలు లెక్కలేనన్ని నష్టాలు తెచ్చిపెట్టాయి. రెండేళ్ల కిందట ఆర్ఎక్స్100తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అజయ్ భూపతితో మహాసముద్రం అనే మల్టిస్టారర్ తెరకెక్కించి దసరా బరిలో దింపాడు.
పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోయిన కంటెంట్ దెబ్బకొట్టడంతో ఫస్ట్ వీక్ పూర్తయ్యేలోపే దుకాణం సర్దేసింది. దాంతో అనీల్‌కు పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తిరిగిరాలేకపోయాయి. ఇక అఖిల్ మీద ఏకంగా రూ.80 కోట్లు పెట్టి తీసిన ఏజెంట్.. పావు వంతు కూడా రికవరీ చేయలేకపోయింది. అదనంగా ఎన్నో విమర్శలు కూడా ఎదర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ నష్టాల్ని భోళా శంకర్ కొంతైనా భర్తి చేస్తుందనుకుంటే.. కొత్తగా భారీ నష్టాల్నే తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఈ సినిమా ఇప్పటివరకు పాతిక కోట్ల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఇక ఇప్పటికే చాలా చోట్ల జనాలు లేక షోలు కూడా రద్దయ్యాయని సమాచారం.
మొన్నామధ్యన వచ్చిన సామజవరగమన కాస్త మంచి లాభాలే తెచ్చిపెట్టినా.. కళ్ల ముందున్న కొండంత నష్టాలను పూడ్చడంలో అది ఏ మూల సరిపోయేలా అనిపించడంలేదు. ఇక హిడింబ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాను సమర్పించినా.. అది కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలా అనిల్ సుంకరకు ఒకదాని తర్వాత మరోకటి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మరీ వీటినుంచి అనిల్ ఎలా గట్టుక్కుతాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

