వీరఖడ్గంతో విజయతిలకం
అగ్ర హీరోలు వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో, హిట్ మిషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. సాహు గారపాటి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో మొదలుకానున్నది.
అగ్ర హీరోలు వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో, హిట్ మిషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. సాహు గారపాటి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో మొదలుకానున్నది. ఓ ఫన్నీ వీడియో ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దర్శకుడు అనిల్ రావిపూడి శైలిలోనే సరదాగా, విభిన్నంగా ఈ వీడియో సాగింది.
ప్రమోషన్స్‌లో, ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్ని అంటూ అభిమానులు తనకు వీరఖడ్గాన్ని బహూకరించారని అనిల్ రావిపూడి ఖడ్గం చేతబూని చెప్పడం, ఊహించని విధంగా ఆ ఖడ్గంతో అనిల్ రావిపూడి బొటనవేలికి చిన్న గాటు పెట్టి, ఆ రక్తంతో అనిల్‌కి వెంకటేశ్ వీరతిలకం దిద్దడం, ఆ తర్వాత కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి, జీవీ ప్రకాశ్‌కుమార్ కూడా అదే విధంగా చేయడం.. ఇలా సరదా సరదాగా ఈ వీడియో సాగింది. ఈ సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో సాగే పూర్తి వినోదాత్మక చిత్రమనే విషయాన్ని కూడా ఈ వీడియోలోనే చిత్రబృందం రివీల్ చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

