టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సునీల్ (Sunil) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈ ఏడాదితో సిల్వర్ జూబ్లీ (Silver jubilee) పూర్తి చేసుకున్నాడు. త్వరలోనే మళ్లీ ఎఫ్ 3 (F3) సినిమాతో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో కనిపించబోతున్నాడు. తాను సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ టైంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో వర్క్ చేయాలని ఉందని చెప్పానన్నాడు సునీల్. సొంతం సినిమాలో నా కామెడీ టైమింగ్ చాలా ఇష్టమని, ఆ సినిమాను చాలా సార్లు చూశానని అనిల్ రావిపూడి తనతో చెప్పారని అన్నాడు సునీల్.
చిట్ చాట్‌లో సునీల్ మాట్లాడుతూ..నాతో ముందుగా చెప్పినట్టుగానే ఎఫ్ 3 సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. వరుణ్‌తేజ్, తనది ఒక బ్యాచ్ అని, వెంకటేశ్-రఘుబాబుది మరో బ్యాచ్ అని, తమన్నా-ఫ్యామిలీది ఇంకో బ్యాచ్ అని చెప్పాడు సునీల్. ఫస్ట్ హాఫ్‌లో నాకు సోలో యాక్టింగ్‌కు చాలా అవకాశం ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే గ్రూప్ కామెడీతో మీరు కడుపుబ్బా నవ్వడం ఖాయమని చెప్పుకొచ్చాడు సునీల్.
ఊహించని కామిక్ టైమింగ్‌తో వెంకటేశ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తారని సునీల్ తెలిపాడు. వరుణ్ తేజ్‌ను సర్ప్రైజింగ్గా పూర్తి స్థాయి ఫన్నీ పాత్రలో చూస్తారు. ఎఫ్ 3 సినిమాతో మూడు రెట్లు వినోదం పక్కా అని ధీమాగా చెప్పుకొచ్చాడు సునీల్. మే 27న థియేటరల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది ఎఫ్ 3.