Anil Ravipudi | అనిల్ రావిపూడిని హీరోగా పరిచయం చేస్తానన్న దిల్ రాజు.. డైరెక్టర్ గారి రియాక్షన్ ఎలా ఉందంటే..!
Anil Ravipudi | కోలీవుడ్ యంగ్ టాలెంట్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదలకు సిద్ధమవుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా, నయనతార నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈవెంట్లో మాట్లాడిన దిల్ రాజు, ప్రదీప్ రంగనాథన్పై ప్రశంసలు కురిపించారు.
Anil Ravipudi | కోలీవుడ్ యంగ్ టాలెంట్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదలకు సిద్ధమవుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా, నయనతార నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈవెంట్లో మాట్లాడిన దిల్ రాజు, ప్రదీప్ రంగనాథన్పై ప్రశంసలు కురిపించారు. లవ్ టుడే’ సినిమా చూసినప్పుడే తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అనిపించింది. అందుకే రిలీజ్ చేశాం. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ప్రదీప్ హీరోగా, డైరెక్టర్గా వరుస విజయాలు సాధిస్తున్నాడు అని తెలిపారు.
ఇక విఘ్నేష్ శివన్ గురించి మాట్లాడుతూ, “అతను ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తాడు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా అలాంటి కొత్త ఐడియాతో వస్తోంది. ఈ రోజుల్లో ప్రేమ కథలు తీయడం కష్టం. కానీ ఈ సినిమా ఒక అప్లికేషన్ బ్యాక్డ్రాప్లో కొత్తగా చూపిస్తోంది” అన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిపై సరదాగా మాట్లాడుతూ, “మా అనిల్ కూడా హీరోలా ఉంటాడు. సరైన కథ, సరైన టైమ్ వస్తే అతన్ని హీరోగా నేనే పరిచయం చేస్తాను” అని చెప్పడంతో ఆడిటోరియంలో నవ్వులు వెల్లువెత్తాయి. దిల్ రాజు వ్యాఖ్యల తర్వాత మైక్ అందుకున్న అనిల్ రావిపూడి సరదాగా స్పందించారు. ఉండండ్రా బాబు… ప్లీజ్. నేను నా పని బాగా చేసుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ నవ్వులు పూయించారు.
అయితే వెంటనే ఆయన క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు గారు ఇచ్చిన ఆఫర్ బాగుంది. కానీ ప్రస్తుతం నేను డైరెక్షన్పైనే ఫోకస్ చేస్తున్నాను. అయితే ప్రదీప్ హీరోగా రాజు గారి నిర్మాణంలో సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది అని తెలిపారు. ప్రదీప్ రంగనాథన్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్న అనిల్, “అతను మనలో ఒకడిలా అనిపిస్తాడు. అతని నటన చాలా నేచురల్గా ఉంటుంది. అందుకే వరుస హిట్స్ వస్తున్నాయి” అని తెలిపారు.ఇక ఎస్.జె. సూర్య పాత్ర సినిమాకు మరో హైలైట్ అవుతుందని చెప్పారు. “ట్రైలర్లో చూపింది చాలా తక్కువ. థియేటర్లలో సినిమా మామూలుగా ఉండదు” అని హైప్ క్రియేట్ చేశారు. కృతి శెట్టి గురించి మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఆమె ఎక్స్ట్రార్డినరీగా నటించింది” అని ప్రశంసించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

