‘ఐపీఎల్ సీజన్లోనూ ‘రాకాస’ సినిమాకు ఆదరణ దక్కడం చాలా గొప్ప విషయం. మంచి కామెడీ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. నేను ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ చూసి పగలబడి నవ్వాను. ఈ సినిమా దర్శకత్వం, నిర్మాణ బాధ్యతల్ని ఇద్దరు అమ్మాయిలు తీసుకొని బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారంటే వారిద్దరికీ హ్యాట్సాప్’ అన్నారు అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ఆదివారం జరిగిన ‘రాకాస’ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. సంగీత్ శోభన్, నయన్సారిక జంటగా నటించిన ‘రాకాస’ చిత్రానికి మానసశర్మ దర్శకురాలు. నిహారిక కొణిదెల నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్లీన్ ఫ్యామిలీ మూవీగా అందరినీ ఆకట్టుకుంటున్నదని, సమ్మర్లో మంచి సక్సెస్ సాధించడం ఆనందంగా ఉందని నిహారిక కొణిదెల చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.