‘తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో వివిధ ఆరోపణలపై సెక్షన్ 51 దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి నివేదిక అందిన తరువాతే నిజానిజాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో నివేదిక వచ్చే వరకు అందరూ వేచిచూడాలి’ అంటూ విజ్ఞప్తి చేశారు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ వల్లభనేని. ‘సెక్షన్ 60 ప్రకారం పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాతే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. ఆ తరువాత జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని అన్ని విషయాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తాం’ అని ఆయన అన్నారు.