అజిత్ హీరోగా నటించిన విశ్వాసంలో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసింది. అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషించిన ది ఘోస్ట్‌లో టీనేజర్‌గా కనిపించింది. రీసెంట్గా బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). ఈ సినిమాలో అనిఖా యాక్టింగ్‌కు మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ బ్యూటీ క్యూట్ యాక్టింగ్‌తో అందరి మనసు దోచేస్తుంది.
తెలుగులో హీరోయిన్గా ఈ ఒక్క సినిమాతోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నదానితో సినిమా చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు క్యూ కట్టాయన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పలు టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలు మల్టీపుల్ డీల్స్ కుదుర్చుకునే పనిలో ఉన్నాయట. ఇప్పటికే రెండు ప్రొడక్షన్స్ అనిఖా సురేంద్రన్‌తో కొత్త సినిమాలకు సంతకం కూడా చేయించుకున్నాయని జోరుగా టాక్ నడుస్తోంది.
టాలీవుడ్లో కృతిశెట్టి, శ్రీలీల సూపర్ క్రేజ్ సంపాదించుకుని.. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు కొట్టేశారు. ఇప్పుడు అనిఖా సురేంద్రన్ విషయంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.