Boys Hostel | కన్నడలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘హుడుగారు బేకగిద్దరే’ (hudugaru bekagiddare) చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ (Boys Hostel) పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 26న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాలో యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautham) స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. ‘బాయ్స్ హాస్టల్’ తెలుగు వెర్షన్ కోసం స్పెషల్‌గా ఆమె పాత్రను క్రియేట్ చేశారు. ఇక ఈ మూవీ విజయం సాధించడం పట్ల రష్మీ సోషల్ మీడియాలో వేదికగా.. ఓ పోస్ట్ పెట్టింది.
‘బాయ్స్ హాస్టల్’ షూటింగ్ సందర్భంగా దిగిన పలు ఫొటోలను రష్మీ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో రష్మీ బాత్ టబ్‌లో జలకాలాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా.. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడీయోస్‌తో కలిసి ఛాయ్ బిస్కెట్ వాళ్లు తెలుగులో సంయుక్తంగా విడుదల చేశారు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.