Anasuya : క్యాన్సర్‌తో కన్నుమూసిన అనసూయ తండ్రి

బుల్లితెర టాప్ యాంకర్స్‌లో ఒకరిగా ఉన్నారు అనసూయ భరద్వాజ్. ఆమె తండ్రి సుదర్శన్ రావు తార్నాకలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సుదర్శన్ రావు ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తుంది. సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. పలు ఇంటర్వ్యూలలో ఆయన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని చెప్పేది అనసూయ. తండ్రి మృతితో అనసూయ కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.
తాము స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తండ్రి మరీ మరీ చెప్పేవారని తెలిపింది. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నా?, వాళ్లను ఎలా హ్యాండిల్ చేస్తున్నాం? అనేది కూడా దూరం నుంచి ఆయన ఓ కంట కనిపెడుతుండేవారని అనసూయ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు జరుగుతుండడం సినీ ప్రియులను కలవరపెడుతుంది. శివ శంకర్ మాస్టారు, సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, కిరణ్ అబ్బవరం సోదరుడు, ఇప్పుడు అనసూయ తండ్రి. ఇలా వరుస విషాదాలతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

