Tantra | అనన్య నాగళ్ల(Ananya Nagalla) నటించిన హార్రర్ డ్రామా Tantra. మార్చి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుషాలినీ, మనోజ్ ముత్యం ఇతర నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్గా రిలీజైన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. అదేంటంటే థియేటర్లలో సినిమా చూడని వారి కోసం కొత్త అప్డేట్ వచ్చింది. తంత్ర పాపులర్ తెలుగుఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఏప్రిల్ 5 న ప్రీమియర్ కానుంది.
థియేటర్లలో అంతగా ఆకట్టుకోకపోయినా.. ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫస్ట్ కాపీ మూవీస్ అండ్ బీ ది వే ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవ సంగీతం అందించాడు. మరి అనన్య నాగళ్లకు ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
Tantra ట్రైలర్..
తంత్ర ఓటీటీ ప్రీమియర్ అప్డేట్..
తంత్రం మంత్రం కుతంత్రం..☠️
ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం!🎬#Tantra Premieres April 05 @AnanyaNagalla @dhanush_vk @saloni_Aswani @srini_gopisetti @RaviChaith #NareshbabuP @firstcopymovies @BeTheWayFilms @TantraTheMovie pic.twitter.com/wrmJ9oAtzk— ahavideoin (@ahavideoIN) March 31, 2024