Amtabh Bachchan | అమితాబ్ బచ్చన్‌కు శస్త్రచికిత్స.. ఎమోషనల్ బ్లాగ్‌తో అభిమానుల్లో ఆందోళన
Amtabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 83 ఏళ్ల వయసులో ఆయనకు ఇటీవల శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ నేరుగా వెల్లడించకపోయినా, తన వ్యక్తిగత బ్లాగ్‌లో చేసిన కామెంట్ ద్వారా అభిమానులకు పరోక్షంగా తెలియజేశారు.
Amtabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 83 ఏళ్ల వయసులో ఆయనకు ఇటీవల శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ నేరుగా వెల్లడించకపోయినా, తన వ్యక్తిగత బ్లాగ్‌లో చేసిన కామెంట్ ద్వారా అభిమానులకు పరోక్షంగా తెలియజేశారు. రోజువారీ జీవితంలో జరిగిన అనుభవాలు, ఆలోచనలు, సంఘటనలను తన బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకునే అమితాబ్ బచ్చన్.. ఈసారి కూడా ఆస్పత్రి అనుభవాన్ని వివరించారు. శస్త్రచికిత్స, ఐసీయూలో నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలు, అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న విషయాలను ప్రస్తావించారు. దీంతో ఆయనకు ఇటీవల ఆపరేషన్ జరిగినట్లు అభిమానులు గుర్తించారు.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ముంబైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్‌కు ఈ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. అయితే అది ఏ ఆరోగ్య సమస్యకు సంబంధించినది? ఏ అవయవానికి ఆపరేషన్ చేశారు? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న అనంతరం అమితాబ్ తన బ్లాగ్‌లో జీవితంపై భావోద్వేగంగా స్పందించారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు చాలా కఠినమైనవి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో ఎంతటి విజేత అయినా, ఒకరోజు ఓటమిని ఎదుర్కోవాల్సిందే. అలాంటి కఠిన సమయాల్లో కొందరు ధైర్యంగా నిలబడతారు, మరికొందరు పరిస్థితులకు లొంగిపోతారు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్నారు.
83 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ శస్త్రచికిత్స చేయించుకోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వేలాది మంది ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా అమితాబ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. వయసు పెరిగినా ఇప్పటికీ సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రకటనలతో బిజీగా ఉంటున్న అమితాబ్ బచ్చన్ తన క్రమశిక్షణ, పట్టుదలతో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా శస్త్రచికిత్స అనంతరం కూడా సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఎదుర్కోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను కదిలిస్తున్నాయి.ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుండగా, పూర్తి వివరాలపై కుటుంబ సభ్యులు లేదా వైద్యులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Amitabh Bachchan
- BIG B
- blog
- Surgery
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

