బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగాను అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఆయన సినిమాలతో పాటు పలు షోస్‌తో ఎంతగానో అలరిస్తున్నారు. అమితాబ్‌ని ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఎంతో ఉండగా, వారు ఒక్కో రూపంలో తమ ప్రేమని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా యువ అభిమాని తన కళానైపుణ్యంతో అమితాబ్ మనస్సు గెలుచుకున్నాడు.
చేతులు లేకపోయిన మంచి ప్రతిభ ఉన్నయువకుడు అమితాబ్ నటించిన ‘గులాబో సితాబో’ సినిమా నుంచి ఆయన లుక్‌ని కాళ్లతో గీసారు. ఆ పెయింటింగ్ అమితాబ్‌కి ఎంతగానో నచ్చడంతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆర్టిస్ట్ పేరు ఆయుష్ అని,ఆయుష్ ప్రత్యేక సామర్థ్యం ఉన్నవాడని, తన చేతులను ఉపయోగించలేడు కానీ కాళ్ళతోనే అద్భుతమైన పెయింటింగ్ వేయగలడని పేర్కొన్నారు. తన బొమ్మని అద్భుతంగా గీసినందుకు యువ కళకారుడికి కృతజ్ఞతలు తెలాయజేశాడు అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ .. కౌన్ బనేగా కరోడ్ పతి షోతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.