Amitabh Bachchan | నాకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదు, ఆరోగ్యంగానే ఉన్నా .. అమితాబ్ బచ్చన్ క్లారిటీ
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స, ఐసీయూ, కోలుకునే ప్రక్రియ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలతో అమితాబ్‌కు సర్జరీ జరిగిందని అభిమానులు భావించారు. అయితే ఈ ప్రచారాలపై తాజాగా ఆయన స్వయంగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స, ఐసీయూ, కోలుకునే ప్రక్రియ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలతో అమితాబ్‌కు సర్జరీ జరిగిందని అభిమానులు భావించారు. అయితే ఈ ప్రచారాలపై తాజాగా ఆయన స్వయంగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. బిగ్ బీ మంగళవారం తన బ్లాగ్‌లో శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడం ఎంత కష్టమో వివరిస్తూ ఓ పోస్ట్ చేశారు. దీంతో ఆయన ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందారని, సర్జరీ చేయించుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పోస్టు వెనుక అసలు ఉద్దేశాన్ని అమితాబ్ వివరించారు.
నాకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు. నేను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాను. నా పోస్ట్‌ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయన స్పష్టం చేశారు. శస్త్రచికిత్స తర్వాత ఐసీయూ నుంచి ఇంటికి వచ్చిన వ్యక్తి ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులను కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించానని చెప్పారు. ఇటీవల జరిగిన అర్జెంటీనా–స్పెయిన్ ఫిఫా మ్యాచ్‌ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానని అమితాబ్ వెల్లడించారు. ఒక ఛాంపియన్ ఓడిపోయిన తర్వాత తిరిగి నిలబడటం ఎంత కష్టమో చెప్పాలనుకున్నాను. ఫిఫా ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిన తర్వాత మెస్సి పరిస్థితిని ఊహించుకుని ఆ పోస్ట్ రాశాను. కానీ, అది నా ఆరోగ్యానికి సంబంధించినదిగా అందరూ భావించారు అని వివరించారు.
అమితాబ్ ఇచ్చిన ఈ వివరణతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యంపై వ్యక్తమైన సందేహాలకు పూర్తిగా తెరపడింది. అంతేకాదు, తాను ప్రస్తుతం మంచి ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్లో కూడా పాల్గొననున్నట్లు అమితాబ్ వెల్లడించారు. దీంతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అమితాబ్ ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 83 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన మరోసారి తన ఫిట్నెస్, పనిపట్ల అంకితభావాన్ని చాటుకున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

