Lal Singh Chaddha Movie | ‘నేను బనియన్, నువ్వు చడ్డీ’.. ఆకట్టుకుంటున్న ‘లాల్ సింగ్ చడ్డా’ స్పెషల్ పోస్టర్
Lal Singh Chaddha Special Poster | బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. అభిమానులు ఈయన సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అద్వౌత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న విడదల కానుంది. తెలుగులో ఈ చిత్రానికి చిరంజీవి సమర్పకుడిగా ఉండటం విశేషం. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘మనమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం. నేను బనియన్, నువ్వు చడ్డీలా’ అనే కాప్షన్‌తో నాగచైతన్య, అమీర్‌ఖాన్‌లు కలిసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో వీరిద్దరూ ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా తాడుపై వేలాడుతూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. లేటస్ట్‌గా విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాను బేస్ చేసుకుని తెరకెక్కించారు. అమీర్‌కు జోడీగా కరినా కపూర్ హీరోయిన్గా నటించింది. వయాకమ్18 స్టూడీయోస్‌తో కలిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Watch the story of Laal and Bala's friendship on 11th August, 4 days to go #LaalSinghChaddha releasing in theatres worldwide.#FriendshipDay
Bookings Opened : https://t.co/4N3Bjs739X @KChiruTweets #AamirKhan @chay_akkineni #AdvaitChandan @ipritamofficial @GeethaArts pic.twitter.com/zHlP07Cxal
— Vamsi Kaka (@vamsikaka) August 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

