వైవాహిక బంధానికి ఆమిర్ స్వస్తి

కిరణ్‌రావ్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటన
బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్‌ఖాన్ తన భార్య కిరణ్‌రావ్ నుంచి విడిపోతున్నట్లుగా ప్రకటించారు. పదిహేనేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా శనివారం ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావ్ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదలచేశారు. ఈ విడాకులను ముగింపులా కాకుండా కొత్త బంధానికి నాందిగా భావించాలని తెలిపారు. ఇకపై వేర్వేరుగానే ఉంటూ తమ జీవితాలను, కుటుంబాలను విస్తరించుకోవడానికి ముందుకు సాగుతామని చెప్పారు. ‘పదిహేనేళ్ల ప్రయాణం జీవితకాలానికి సరిపోయే ఎన్నో మధురస్మృతులను మాకు మిగిల్చింది. చాలా ఆనందాల్ని, నవ్వుల్ని కలిసి పంచుకున్నాం. నమ్మకం, ప్రేమ, గౌరవం అనే పునాదులపై మా బంధం బలపడింది. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. ఇకపై మేము భార్యాభర్తలుగా కొనసాగబోం. చాలా కాలం నుంచి మేము విడిపోవాలని అనుకుంటున్నాం. అందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాం. కుటుంబం కోసం సహ తల్లిదండ్రులుగా బాధ్యతల నిర్వహణలో ఒకరికొకరం అండగా ఉంటాం. కుమారుడు ఆజాద్‌కు తల్లిదండ్రులుగా ఉంటూ అతడి బరువుబాధ్యతల్ని సమంగా స్వీకరిస్తాం. అలాగే సినిమాలు, పానీ ఫౌండేషన్‌తో పాటు ఇతర వృత్తిపరమైన విషయాల్లో కలిసే పనిచేస్తాం. మా జీవితంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలను అర్థంచేసుకుంటూ నిరంతరం మాకు మద్దతును తెలియజేస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ సహాయసహకారాలను ఇలాగే అందిస్తారని భావిస్తున్నాం’ అని తెలిపారు. ‘లగాన్’ చిత్రీకరణ సమయంలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావుల మధ్య పరిచయం ఏర్పడింది. 2005 డిసెంబర్లో వీరు వివాహం చేసుకున్నారు. 2011లో సరోగసీ ద్వారా వీరికి కొడుకు జన్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

