ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రాన్ని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతున్నది. సోమవారం టీజర్‌ను నిర్మాత వంశీ నందిపాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాలో రియల్ హైదరాబాద్ కల్చర్‌ను చూపించారని, మధ్య తరగతి జీవితాలను చక్కగా ఆవిష్కరించారని అన్నారు. హైదరాబాద్ నేపథ్యంలో ఆద్యంతం వినోదం, భావోద్వేగాల కలబోతగా సాగే చిత్రమిదని నిర్మాత మాధవి రెడ్డి తెలిపారు. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, దర్శకుడు: రమణా రెడ్డి సోమ.