KGF chapter 2 | అమెజాన్‌లో రూ.199కు కేజీఎఫ్ చాఫ్టర్ 2..కొత్త ఆఫర్ వర్కవుట్ అయ్యేనా..?
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ..ఇప్పటికే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.1000 కోట్ల మార్కును దాటేసింది. కాగా ఎవరూ ఊహించని విధంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైం వీడియో ( Amazon Prime Video)కొత్త ఆఫర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటించిన పాన్ ఇండియా ప్రాజెక్టు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ప్రాజెక్టు బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ..ఇప్పటికే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.1000 కోట్ల మార్కును దాటేసింది. కాగా ఎవరూ ఊహించని విధంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైం వీడియో ( Amazon Prime Video)కొత్త ఆఫర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 ప్రస్తుతం అమెజాన్ ప్రైం వీడియోలో అందుబాటులో ఉండగా..సినిమాను వీక్షించాలంటే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది.
అమెజాన్ సబ్ స్క్రైబర్లు సినిమా చూసే ఉచిత యాక్సెస్ (ఆన్ లైన్ స్ట్రీమింగ్) వినియోగించుకునే కంటే ముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇలా అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ..టికెట్ రూపంలో రూ.199 ధర పెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఇంత మొత్తం అంటే దాదాపు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసినంత ఖర్చవుతున్నట్టే. కానీ సినిమా థియేటర్లో సినిమా చూసిన థ్రిల్ ఓటీటీలో మాత్రం రాదు. కొన్ని రోజులు ఆగితే సబ్ స్క్రిప్షన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఉచితంగానే సినిమా చూసుకునే వీలుంటుంది.
గతంలో సల్మాన్ ఖాన్ తన సినిమాను Pay Per View modelలో ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేజీఎఫ్ 2 మేకర్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో తీసుకొచ్చిన కొత్త విధానం ఏ మేరకు వర్కవుట్ అవుతుందని కొన్ని రోజులు ఆగితే తెలియనుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్ కలిసొస్తుందా..? లేదా..? అనేది చూడాలి.
ఇండియాలో ఓటీటీ ప్లాట్ ఫాం వినియోగించేవాళ్లు వేరే వాళ్ల యూజర్ నేమ్స్ , పాస్ వర్డ్‌లను తీసుకుని సినిమాలు చూసుకునే వీలుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే దాదాపు చాలా మంది రెండు మూడు ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు. కొత్త ఆఫర్ సక్సెస్ అయితే అమెజాన్ ప్రైమ్ త్వరలోనే రెంటల్ మోడల్‌ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

