Buddy | అప్పుడే ఓటీటీ ఫ్లాట్‌ఫాం కన్ఫామ్ చేసిన మెగా హీరో..!
Buddy | అల్లు శిరీష్ (Allu Sirish) నటిస్తోన్న కొత్త చిత్రం బడ్డీ (Buddy). స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న బడ్డీకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. బడ్డీ ఓటీటీ ప్లాట్‌ఫాంను ఫైనల్ చేశారు మేకర్స్.
Buddy | మెగా హీరో అల్లు శిరీష్ (Allu Sirish) నటిస్తోన్న కొత్త చిత్రం బడ్డీ (Buddy). స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న బడ్డీ గ్లింప్స్ వీడియో (Buddy First Glimpse) ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రౌడీ గ్యాంగ్ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు గ్లింప్స్ తో చెప్పేశాడు డైరెక్టర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. బడ్డీ ఓటీటీ ప్లాట్‌ఫాంను ఫైనల్ చేశారు మేకర్స్.
పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ బడ్డీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఆర్య నటించిన తమిళ చిత్రం టెడ్డీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేఈ జ్ఞానవేళ్ రాజా సమర్పణలో ఆధన జ్ఞానవేళ్ రాజాతో కలిసి నిర్మిస్తున్నారు.
బడ్డీలో అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ అలీ, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. మనిషిలా ప్రవర్తించే టెడ్డీని రౌడీలు ఎందుకు టార్గెట్ చేశారు. అల్లు శిరీష్ ఆ టెడ్డీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే అంశాలపై సస్పెన్స్ లో పెడుతూ విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అల్లు శిరీష్ ఇప్పటిరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని కథాంశంతో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది. అల్లు శిరీష్ చివరగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో బడ్డీ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
బడ్డీ ఫస్ట్ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

