ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. బన్నీ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.అయాన్,అర్హల అల్లరితో పాటు బన్నీకి సంబంధించిన విషయాలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అయాన్, అర్హలకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
బన్నీ కూతురు అర్హ..శాకుంతలం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అర్హకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది. ఇక ఇదిలా ఉంటే బన్నీ తనయుడు అయాన్.. గని సినిమాలోని పాటకు తనదైన స్టైల్లో అదరగొట్టాడు. వరుణ్ తేజ్ చిత్రంలో బాక్సర్ అయ్యేందుకు ఎంతగా కష్టపడ్డాడో అయాన్ తన స్టైల్లో చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతుండగా, నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అందులో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ ‘గని’ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.