Allu Ayaan | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగానే నిలుస్తుంటాడు. తన సరదా మాటలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను అలరించే అయాన్‌కు ఇప్పటికే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అభిమానులు ప్రేమగా అతడిని “మోడల్ అయాన్” అని కూడా పిలుస్తుంటారు. తాజాగా అల్లు అయాన్ చేసిన ఓ మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే జంతువుల పట్ల ప్రేమ, బాధ్యత చూపిస్తూ అల్లు అయాన్ ఓ గుర్రాన్ని దత్తత తీసుకున్నాడు. “రేస్ 2 ఫౌండేషన్” అనే సంస్థ నుంచి ‘సిద్ధార్థ్’ అనే గుర్రాన్ని అయాన్ అడాప్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.
సంస్థ షేర్ చేసిన ఫోటోలో గుర్రం పక్కన ‘సిద్ధార్థ్’ అనే పేరు, అలాగే డోనర్‌గా ‘అల్లు అయాన్’ పేరు ఉన్న బోర్డులు కనిపించాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు అయాన్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది. “జంతువుల పట్ల ప్రేమను చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంచాలి” అంటూ పలువురు అభిమానులు స్పందిస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు అయాన్‌కు మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్‌తో కలిసి పలు సందర్భాల్లో కనిపిస్తూ తన స్టైల్, మాటలతో ఆకట్టుకున్న అయాన్.. ఇప్పుడు మంచి పనితో కూడా అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇక అల్లు అర్జున్ అభిమానులు మాత్రం “తండ్రిలాగే కొడుకూ మంచి మనసున్నవాడే” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారి చేసిన ఈ మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.