Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సారి అయితే ఆ స్పెషల్ కానుంది. ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ రోజును మరింత గుర్తుండేలా చేయడానికి భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను ఏప్రిల్ 8 ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ను ‘AA22xA6’గా పిలుస్తుండగా, ఇకపై అసలు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప 2: ది రూల్ విజయంతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ‘జవాన్’తో భారీ హిట్ అందుకున్న అట్లీ కలయికలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి.
సినిమా ప్రారంభానికి ముందే అల్లు అర్జున్, అట్లీ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వెళ్లి హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో చర్చలు జరపడం ఆసక్తి రేకెత్తించింది. దీంతో ఈ చిత్రం హైఎండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందనే టాక్ బలపడింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మంధాన విలన్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివీల్‌తో ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న ఆసక్తి మరింత పెరగడం ఖాయం. అభిమానులు రేపటి అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.