Allu Arjun | జపాన్ ప్రతినిధికి బన్నీ సాంప్రదాయ కానుక .. సంతోషం వ్యక్తం చేసిన గీక్ పిక్చర్స్ సీఈఓ
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కోసానోకు సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించడం విశేషంగా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ కానుకను అందించడం ద్వారా భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశాన్ని అల్లు అర్జున్ వ్యక్తపరిచారు.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కోసానోకు సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించడం విశేషంగా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ కానుకను అందించడం ద్వారా భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశాన్ని అల్లు అర్జున్ వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, శ్రీరాముడి కథ ప్రాముఖ్యత గురించి టొమాట్సు కోసానోకు వివరించినట్లు సమాచారం.
సీతారాముల కల్యాణం చిత్రపటం భారతీయ సంస్కృతికి ప్రతీకగా భావించబడుతుంది. అలాంటి పవిత్రమైన చిత్రాన్ని విదేశీ అతిథికి బహూకరించడం ద్వారా అల్లు అర్జున్ తనలోని ఆధ్యాత్మికతను, భారతీయ వారసత్వంపై ఉన్న గౌరవాన్ని మరొసారి చాటిచెప్పారు. దీనిపై అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇటీవల భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న గుర్తింపు నేపథ్యంలో, ఇలాంటి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఈ విధంగా భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం విశేషంగా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రేక్షకులను అలరించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.పుష్ప2 చిత్రం తర్వాత బన్నీ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అట్లీ సినిమాతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

