Allu Arjun | బన్నీ సీక్రెట్స్ వైరల్.. అల్లు అర్జున్‌పై శిరీష్ సరదా కామెంట్స్!
Allu Arjun | పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఉత్తరాదిలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని, టాప్ స్టార్ల సరసన నిలిచాడు. దీంతో బన్నీతో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
Allu Arjun | పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఉత్తరాదిలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని, టాప్ స్టార్ల సరసన నిలిచాడు. దీంతో బన్నీతో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన తమ్ముడు అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
గతంలో అల్లు శిరీష్, నటుడు అలీ హోస్ట్ చేసిన ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఆ సందర్భంగా తన అన్న అల్లు అర్జున్ గురించి సరదాగా మాట్లాడుతూ చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. శిరీష్ మాట్లాడుతూ, చిన్నప్పుడు బన్నీకి చదువు అంతగా రాదని సరదాగా చెప్పాడు. “అమ్మ రాత్రంతా కూర్చోబెట్టి ఎంత చదివించినా, ఉదయానికి చదివింది మొత్తం మర్చిపోయేవాడు. పరీక్షల్లో కూడా పెద్దగా రాసేవాడు కాదు” అంటూ నవ్వుతూ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
ఇక మరో సందర్భంలో తమ అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా శిరీష్ వివరించాడు. “నేను ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా ముందుగా బన్నీ వేసుకునేవాడు. తర్వాత నేను వేసుకుంటే అందరూ ‘ఇది బన్నీ డ్రెస్ కదా’ అని అడిగేవారు” అంటూ చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బన్నీ చిన్నప్పటి విషయాలు తెలిసి ఆశ్చర్యపోతుండగా, మరికొందరు అన్నదమ్ముల బాండింగ్‌ను మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. ‘పుష్ప 2’ విజయానంతరం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్లో బన్నీ లుక్ పూర్తిగా భిన్నంగా ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

