దాక్కో దాక్కో మేక

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, స్వరకర్త దేవిశ్రీప్రసాద్ కలయికలో వచ్చిన పాటలన్నీ చక్కటి ప్రజాదరణ పొందాయి. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక..’ అనే ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 13న విడుదలచేయబోతున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు ప్రధాన గాయకులు ఈ పాటను ఆలపించనుండటం విశేషం. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళంలో బెన్నీదయాల్ ఈ పాటకు గాత్రాన్ని అందించనున్నారు. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజ్‌గా విలక్షణ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా రెండు భాగాల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- dsp
- Pushpa song
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

