Allu Arjun – Chiranjeevi |టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) జైలు నుంచి విడుదలైన అనంతరం మొదటిసారిగా చిరంజీవి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి బన్నీనే స్వయంగా కారు నడుపుకుంటూ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు.
ఇక మెగాస్టార్ ఇంట్లో దాదాపు గంటన్నరసేపు గడిపిన అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లంచ్ చేశాడు. అనంతరం తన అరెస్ట్‌కు సంబంధించి కేసు ఘటనపై చిరు అల్లు అర్జున్ను అడిగి వివరాలు తెలుసుకున్నాడు. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న చిరు అనంతరం బన్నీకి న్యాయపరమైన సలహాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ బయటికి రావడానికి లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కోసం నిరంజన్ రెడ్డి వాదించడంలో చిరుతో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక పాత్ర పోషించాడు.
Ultimate star power combo! 🔥
Megastar @KChiruTweets and Icon Star @alluarjun together! 😎#Chiranjeevi #AlluArjun #AlluSnehaReddy #TeluguFilmNagar pic.twitter.com/Nd4VzwH7x9— Telugu FilmNagar (@telugufilmnagar) December 15, 2024