Allu Arjun | చిన్నారి లుకేమియా పేషెంట్ కల నెరవేర్చిన అల్లు అర్జున్.. ‘పుష్ప’ సీన్ రీక్రియేట్
AlluArjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుకేమియాతో బాధపడుతున్న చిన్నారి శ్రద్ధ కోరికను తీర్చారు. మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమెను కలిసిన అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ మూమెంట్స్‌ను ఆమెతో కలిసి రీక్రియేట్ చేశారు.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుకేమియాతో బాధపడుతున్న చిన్నారి శ్రద్ధ కోరికను తీర్చారు. మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమెను కలిసిన అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ మూమెంట్స్‌ను ఆమెతో కలిసి రీక్రియేట్ చేశారు. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను అల్లు అర్జున్ టీమ్ షేర్ చేయగా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియోలో అల్లు అర్జున్ నవ్వుతూ హాయ్ శ్రద్ధా, ఎలా ఉన్నావ్? అని పలకరించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాలోని ఐకానిక్ డైలాగ్ చెప్పమని ప్రోత్సహించారు. ఇద్దరూ కలిసి పుష్ప సిగ్నేచర్ బియర్డ్ స్ట్రోక్ చేయగా, అల్లు అర్జున్ చప్పట్లు కొడుతూ “డ్యామ్ క్యూట్” అని మెచ్చుకున్నారు. చివరగా నువ్వు కోలుకున్న తర్వాత హైదరాబాద్‌కు రా అని చెప్పారు. ఏమవ్వాలనుకుంటున్నావ్ అని అడగగా, శ్రద్ధ డాక్టర్ అవ్వాలని ఉందని బదులిచ్చింది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె కూడా నటిస్తోంది.
Spreading Smiles Beyond Cinema ❤️
Icon Star @alluarjun interacted with Shraddha through the Make-A-Wish Foundation, creating a joyful and unforgettable moment for the young girl. 🤗
A gesture that reflects his genuine warmth and compassion. ❤️ pic.twitter.com/qExSfmTh6a
— Team Allu Arjun (@TeamAAOfficial) June 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

