Arya | ఆర్య @ 21.. మెమోరీస్ గుర్తు చేసుకున్న అల్లు అర్జున్..గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
Arya | టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన ప్రేమ కథా చిత్రాలలో ఆర్య ఒకటి అని చెప్పవచ్చు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 2004లో విడుదలై అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.
Arya | టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన ప్రేమ కథా చిత్రాలలో ఆర్య ఒకటి అని చెప్పవచ్చు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 2004లో విడుదలై అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండడం, పాటలు మరింత అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకి ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ చిత్రం టీవీలలో వస్తే ఇప్పటికీ అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఆయన అందించిన బీజీఎం, పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఇక ఈ సినిమాలో బన్నీ నటన కూడా సూపర్భ్ అని చెప్పాలి. నవ్విస్తూనే ప్రేక్షకులకి కన్నీళ్లు పెట్టించాడు. ఈ చిత్రంతోనే బన్నీ ఫేట్ మారిపోయింది . సుకుమార్ తో కలిసి ఆ తర్వాత ఆర్య 2 సినిమా చేశాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే పుష్ప ఫ్రాంచైజీలో రెండు సినిమాలు చేశాడు . ఇవి అల్లు అర్జున్ ని పాన్ ఇండియా హీరోగా చేశాయి. ఆర్య సినిమా రిలీజ్ అయి నేటికి 21 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పాత మెమోరీస్ గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశాడు. ఇక తన పోస్ట్‌కి కామెంట్‌గా ఆర్య కేవలం సినిమా మాత్రమే కాదు. నా లైఫ్ ని మార్చేసి కొత్త జర్నీని ఇచ్చింది. అప్పటి ప్రేమ, జ్ఞాపకాలు, మ్యాజిక్ ఇంకా నా మదిలో పదిలంగా ఉన్నాయి అంటూ బన్నీ పోస్ట్ పెట్టాడు.
ఇక బన్నీ ఫ్యాన్స్ ఆర్యని ట్రెండ్ చేస్తూ బన్నీ పోస్ట్ ని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆర్య సినిమా ఆడియో ఈవెంట్ కి అప్పట్లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ గెస్టులుగా వచ్చారు. ఆర్య సినిమా ఆడియో ఈవెంట్లో మూవీ యూనిట్ తో పాటు ప్రభాస్, పవన్ కలిసి సందడి చేశారు. ఇక ఆర్య సినిమాని సుకుమార్.. బన్నీతో అనుకోలేదట. దిల్ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న నితిన్‌తో చేయాలని భావించాడట. దిల్ సినిమా తర్వాత ఆర్య సినిమా చేద్దాం అనుకుంటే అప్పటికే నితిన్ అరడజన్ కు పైగా సినిమాలను ఒప్పుకున్నదట. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ ప్రాజెక్ట్ బన్నీ చెంతకు చేరింది. ఈ సినిమా పుష్పగాడి రేంజ్ మార్చేసింది.
#Arya wasn’t just a film, It was the beginning of a journey that changed my life forever. Grateful for the love, the memories, and the magic that still lives on. 🖤 #21YearsForArya pic.twitter.com/RWm6WYRXbu
— Allu Arjun (@alluarjun) May 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 21 years
- Allu arjun
- arya
- Dil raju
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

