Allu Arjun – Instagram | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రముఖ సామజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని ఈ మార్క్ అందుకున్న తొలి దక్షిణాది హీరోగా నిలిచాడు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడిస్తూ.. ‘నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ ధన్యవాదాలు’ అంటూ రాసుకోచ్చాడు. ఇక అల్లు అర్జున్ తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), మూడో స్థానంలో రామ్ చరణ్ (20.8) ఉండగా.. సౌత్‌లో దుల్కర్ సల్మాన్ (14.1 మిలియన్లు), యశ్ (13.5 మిలియన్లు), మహేశ్ బాబు (13.4 మిలియన్లు), ప్రభాస్ (11.7 మిలియన్లు) ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.