అర్హ షూటింగ్ పూర్తి.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన శాకుంతలం టీం

అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ..శాకుంతలం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. చిత్రంలో భరతుడి పాత్ర పోషిస్తున్న అర్హ రీసెంట్గా షూటింగ్లో పాల్గొంది. అర్హపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర బృందం. అర్హ పర్ఫార్మెన్స్ని చూసేందుకు బన్నీ రీసెంట్గా సెట్స్‌కి కూడా వచ్చిన విషయం తెలిసిందే.కూతురి నటనను చూసి తెగ మురిసిపోయిన ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
శకుంతల, దుష్యంతుడి కూతురు భరతుడి పాత్రలో అర్హ నటిస్తుండగా, ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా వీడ్కోలు ఇచ్చింది. అర్హతో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ జరిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బన్నీ,అర్హ సినిమాల షూటింగ్స్ ఒకే లోకేషన్స్‌లో జరగడంతో ఈ విషయాన్నిబన్నీ తన సోషల్ మీడియా ద్వారా చెప్పి ఆనందించాడు. ”ఈ రోజు నేను నా కుమార్తె అర్హ ఒకే లొకేషన్ లో వేర్వేరు చిత్రాల షూటింగ్స్ చేస్తున్నాము. దీంతో నేను ఆమె సెట్ ను సందర్శించాను. 15-20 సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం వస్తుందని నేను భావించాను. కానీ ఇది చాలా త్వరగా జరిగింది. ‘శాకుంతలం’ లో భరత ని పుష్ప మీట్ అయ్యాడు. ఇది గుర్తుండిపోయే యాదృచ్చికమైన రోజు” అని అల్లు అర్జున్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

