వసూళ్లలో కొంత భాగం సైనికుల సహాయనిధికి అందిస్తాం
‘ఓవైపు మన సైనికులు దేశంకోసం పోరాడుతుంటే.. సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు. అందుకే కేవలం ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రెస్‌మీట్ పెట్టాం. మన సైనికులకు సపోర్ట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు వచ్చే వసూళ్లలో కొంత భాగం సైనికుల సహాయనిధికి అందజేయనున్నాం.’ అని అల్లు అరవింద్ తెలిపారు.
‘ఓవైపు మన సైనికులు దేశంకోసం పోరాడుతుంటే.. సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు. అందుకే కేవలం ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రెస్‌మీట్ పెట్టాం. మన సైనికులకు సపోర్ట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు వచ్చే వసూళ్లలో కొంత భాగం సైనికుల సహాయనిధికి అందజేయనున్నాం.’ అని అల్లు అరవింద్ తెలిపారు. ఆయన సమర్పణలో శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సింగిల్’. కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. కార్తీక్‌రాజు దర్శకుడు. విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ఉద్రిక్తతల నడుమ ఈ మూవీని విడుదల చేయడం కరెక్ట్ కాదేమోనని ముందు సందేహించాం. సినిమాకోసం వందలమంది పనిచేస్తారు. థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే తప్పుగా అర్థం చేసుకోరనే నమ్మకంతో సినిమాను విడుదల చేశాం. థియేటర్లలో ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. శ్రీవిష్ణు, వెన్నెలకిశోర్ అద్భుతంగా అలరించారు. ఇద్దరు హీరోయిన్లు చక్కగా నటించారు. అందరూ మెచ్చేలా సినిమాను తీసిన దర్శకుడికి అభినందనలు.’ అని అల్లు అరవింద్ అన్నారు. ఇంకా హీరో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్, డైరెక్టర్ కార్తీక్‌రాజు, కేతిక శర్మ, ఇవానా, నిర్మాత విద్య కొప్పినీడి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

