Allari Naresh | ఉగ్రం బడ్జెట్ అన్ని కోట్లా.. అల్లరి నరేష్ రేంజ్ మాములుగా లేదుగా..!
Ugram Movie | క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నఈ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి.
Ugram Movie Budget | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నటుడు అల్లరి నరేష్. ఏడాదికి రెండు మూడు కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను బోలెడంత ఎంటర్టైన్ చేసే నరేష్ ‘నాంది’తో రూటు మార్చాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సీరియస్ పాత్రలో నటించి ఔరా అనిపించుకున్నాడు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా నరేష్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘మారేడు మిల్లి ప్రాజానీకం’ మరీ కోట్లు కొల్లగొట్టలేదు కానీ కమర్షియల్‌గా సేఫ్ అయింది. దాంతో నరేష్‌పై కోట్ల పెట్టుబడి పెట్టచ్చు అనే నమ్మకం నిర్మాతల్లో కలిగింది.
ప్రస్తుతం నరేష్ తనకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘ఉగ్రం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పూర్తి స్తాయి సీరియస్ సినిమాగానే తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, టీజర్ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ కుటుంబం జోలికి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ పాయింట్‌తో తెలుగులో చాలానే సినిమాలొచ్చాయి. అయితే విజయ్ టేకింగ్, విజన్ కొత్త తరహా కథ చూస్తున్న ఫీలింగ్ కలుగజేస్తుందని పోస్టర్లతోనే స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఇన్నాళ్లు మనం నరేష్‌లోని కామెడీ పోలీస్‌ను చూశాం. కానీ మొదటి సారి అల్లరోడిని సీరియస్ పోలీస్ పాత్రలో చూస్తుండటం కాస్త ఆసక్తిని పెంచుతుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా బడ్జెట్ లెక్కలు వింటే ఆశ్చర్యమేస్తుంది. ఈ సినిమాకు దాదాపుగా రూ.15 కోట్లకు పైగానే బడ్జెట్ అయిందని తెలుస్తుంది. అల్లరి నరేష్ మార్కెట్‌ను బట్టి చూస్తే ఇది చాలా పెద్ద నెంబరే. అయితే ఈ కాంబోపై ఉన్న నమ్మకం బడ్జెట్ కట్టలు తెంపేసింది. కంటెంట్ కొత్తగా ఉంటే బడ్జెట్ ఎంతైనా పెట్టొచ్చు అనే ధీమాతో నిర్మాతలు నరేష్‌పై కోట్ల పెట్టుబడి పెట్టారు. కాగా నాన్-థియేట్రికల్ రూపంలోనే ఈ సినిమాకు దాదాపు రూ.10 కోట్లు అందనున్నాయట. ఇక థియేట్రికల్‌గా రూ.5 కోట్ల మేర బిజినెస్ జరుగనుంది. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలు ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. నరేష్‌కు జోడీగా మిర్నా మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పాకాలా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నాడు. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

