Allari Naresh | నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగాను : అల్లరి నరేష్
Ugram Movie | చాలా కాలం తర్వాత 'నాంది'తో అల్లరి నరేష్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడమే కాదు తనలోని కొత్త నటుడుని పరిచయం చేశాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్ పెరిగింది.
Ugram Movie | చాలా కాలం తర్వాత ‘నాంది’తో అల్లరి నరేష్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడమే కాదు తనలోని కొత్త నటుడుని పరిచయం చేశాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్ పెరిగింది. ఇక విజయ్ కనకమేడల దర్శకుడిగా తొలి అడుగులోనే తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఉగ్రం అనే థ్రిల్లర్ సినిమా కోసం చేతులు కలిపారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో అల్లరి నరేష్ వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
ప్రమోషన్లో భాగంగా నరేష్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సినిమాలోని ఓ ఫైట్ సీన్ కోసం నరేష్ నాలుగు రోజుల్లో 500వరకు సిగరెట్లు తాగినట్లు తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పాడు. దాంతో దగ్గు, జ్వరంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక సీన్ కోసం ఇంత రిస్క్ చేశాడా అని అందరూ షాక్ అవుతున్నారు. పలువురు నెటిజన్లు డెడికేషన్ అంటే నీది నరేష్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. నరేష్‌కు జోడీగా మిర్నా మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పాకాలా సంగీతం అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

