Adipurush Movie | ఆదిపురుష్‌పై నిషేధం.. సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్
Adipurush Movie | ట్రైలర్, పాటలతో ఎంతెంత పాజిటీవిటీ సంపాదించుకుందో రిలీజయ్యాకా అంతకంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది ఆదిపురుష్ సినిమా. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టు ముట్టాయి.
Adipurush Movie | ట్రైలర్, పాటలతో ఎంతెంత పాజిటీవిటీ సంపాదించుకుందో రిలీజయ్యాకా అంతకంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది ఆదిపురుష్ సినిమా. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టు ముట్టాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు ఒక్క పాజిటీవ్ రివ్యూ వస్తే ఒట్టు. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. నెగెటివిటీని తగ్గించేందుకు చిత్రబృందం ఎన్నివిధాలా ప్రయత్నించిన ప్రేక్షకులు మాత్రం సినిమాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోదికి లేఖ రాసింది.
వెంటనే థియేటర్లో ఈ సినిమాను నిషేధించండి. భవిష్యత్‌లో ఓటీటీలోనూ విడుదల చెయ్యోద్దు అని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా దర్శకుడు ఓం రౌత్, రైటర్ మనోజ్ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. ఈ సినిమాలోని డైలాగ్స్ రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో పేర్కొంది. ఆదిపురుష్ సినిమా హిందువుల మతపరమైన సెంటిమెంట్లను, సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోందిని, ఆదిపురుష్ లోని రాముడు, రావణుడి పాత్రల్ని వీడియో గేమ్‌గా చిత్రీకరించారని అసోసియేషన్ ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధించే విధంగా సినిమా ఉందని, తక్షణం ఈ సినిమా ప్రసారాల్ని ఆపేయమని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది.
ఇక ఆదిపురుష్ కలెక్షన్లు కూడా పడిపోయాయి. తొలిమూడు రోజుల్లో మూడొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా సోమవారం కనీసం నలభై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ ముందు కొండంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. ఇప్పుడున్న పరిస్థుతుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరి ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించి విజయ కేతనం ఎగురవేస్తుందా? లేదా? అనేది చూడాలి.
All India Cine Workers Association write to Prime Minister Narendra Modi, requesting him to “stop screening the movie and immediately order a ban of #Adipurush screening in the theatres and OTT platforms in the future.
“We need FIR against Director Om Raut, dialogue writer… pic.twitter.com/jYq3yfv05c
— ANI (@ANI) June 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

