Alpha | సెన్సార్ పూర్తి చేసుకున్న ఆలియా ‘ఆల్ఫా’.. రన్టైమ్ ఎంతంటే?
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha) విడుదలకు సర్వం సిద్ధమైంది.
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha) విడుదలకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి ‘U/A 16+’ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది.
మొత్తం 2 గంటల 20 నిమిషాల (140 నిమిషాలు) రన్టైమ్తో వస్తున్న ఈ చిత్రంలో ఫస్టాఫ్ 1 గంట 13 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 7 నిమిషాలు ఉండనుంది. సెన్సార్ బోర్డు సినిమాలో పెద్దగా సీన్లు ఏవీ తొలగించనప్పటికీ, ఫస్టాఫ్లోని కొన్ని పదాలను మ్యూట్ చేయడంతో పాటు సెకండాఫ్లో వచ్చే కొన్ని తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలను తగ్గించి ప్రత్యామ్నాయ విజువల్స్ ఉంచాలని సూచించింది. అలాగే ప్రారంభ డిస్క్లైమర్ కార్డ్ మార్పు, పాటలకు సబ్టైటిల్స్, మద్యం సీన్లలో హెచ్చరికలు చేర్చాలని మేకర్స్ను ఆదేశించింది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మక ‘స్పై యూనివర్స్’ లో వస్తున్న మొదటి మహిళా ప్రధాన చిత్రం ఇదే కావడం విశేషం. శివ్ రవైల్ దర్శకత్వంలో ఆలియా భట్, శర్వరి వాగ్, అనీల్ కపూర్, బాబీ డియోల్, ఆర్. మాధవన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

