Alia Bhatt | ‘తుంబాడ్ 2’ లోకి ఆలియా భట్.. క్రేజీ అప్డేట్తో సోషల్ మీడియా షేక్!
Sohum Shah | భారతీయ చలనచిత్ర రంగంలో అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన కథాంశంతో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘తుంబాడ్’ (Tumbbad).
Alia Bhatt | భారతీయ చలనచిత్ర రంగంలో అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన కథాంశంతో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘తుంబాడ్’ (Tumbbad). ఈ సినిమా సీక్వెల్ ‘తుంబాడ్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర పరిశ్రమలో ఒక భారీ సంచలన అప్డేట్ వెలువడింది. బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ అధికారికంగా ‘తుంబాడ్ 2’ చిత్రబృందంలో చేరింది. ఈ విషయాన్ని సినిమా హీరో మరియు నిర్మాత సోహుమ్ షా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడిస్తూ ఆలియాకు ఘన స్వాగతం పలికారు. ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.. ‘తుంబాడ్ 2’ లోకి స్వాగతం ఆలియా భట్. ప్రళయం రాబోతోంది” అంటూ సోహుమ్ షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలియాతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాలో భాగం కావడంపై ఆలియా భట్ సైతం హర్షం వ్యక్తం చేసింది. తాను మొదటిసారి ‘తుంబాడ్’ చూసినప్పటి నుంచి ఆ చిత్రం తన మనసులోనే ఉండిపోయిందని, ఇంతటి ప్రత్యేకమైన ప్రపంచంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. సోహుమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అద్భుతమైన నటులతో కలిసి పనిచేయడానికి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
ఇక ‘తుంబాడ్ 2’ లో ఆలియా భట్ పాత్ర కేవలం అతిథి పాత్రగా కాకుండా కథను మలుపు తిప్పే కీలకమైన రోల్‌గా ఉండబోతోంది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సీక్వెల్‌కు ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 3, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

