Kalki 2898 AD | ‘కల్కి 2’ లో ఆలియా భట్.. సైలెంట్‌గా షూటింగ్ కూడా పూర్తి చేసిన బాలీవుడ్ బ్యూటీ?
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ వండర్ ‘కల్కి 2898 ఏడి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ వండర్ ‘కల్కి 2898 ఏడి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పురాణాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల నటన ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ భారీ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘కల్కి-2’ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలోనే ‘కల్కి’ ఫ్రాంచైజీ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో మొదటి భాగంలో నటించిన దీపికా పదుకొనె కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆలియా భట్ దీపికా పోషించిన ‘సుమతి’ పాత్రను చేయడం లేదని తెలుస్తుంది. ఈ సినిమాలో వచ్చే ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్లో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. మరింత షాకింగ్ విషయమేమిటంటే.. ఆలియా భట్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన కొంతమేర షూటింగ్‌ను కూడా సైలెంట్‌గా పూర్తి చేసిందని టాక్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆలియా.. ఇప్పుడు ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్లో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ అలియా ఎంట్రీపై త్వరలోనే వైజయంతీ మూవీస్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

