Alia Bhatt | అలియా భట్ ఇంట్లో దీపావళి వేడుకలు.. సందడి చేసిన అందాల ముద్దుగుమ్మలు
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ అలియా భట్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఈ సారి తన అందం, సినిమాలతో మాత్రం కాదు. దీపావళి పండుగ సందర్భంగా తన ఇంట్లో స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి సంబరాలు జరుపుకోగా, ఆ వేడుక ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే క్షణాలలో వైరల్ అయ్యాయి.
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ అలియా భట్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఈ సారి తన అందం, సినిమాలతో మాత్రం కాదు. దీపావళి పండుగ సందర్భంగా తన ఇంట్లో స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి సంబరాలు జరుపుకోగా, ఆ వేడుక ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే క్షణాలలో వైరల్ అయ్యాయి. ఫొటోలలో గోల్డెన్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన అలియా, తన అందంతో నెటిజన్లను ఫిదా చేసింది. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ అతిథులు కరీనా కపూర్, కరిష్మా కపూర్, అలేఖ వాణి జైన్, నందనీ తాషా, అనీషా మల్హోత్రా జైన్, నీతూ కపూర్ లాంటి స్టార్ ఫ్రెండ్స్. అందరితో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
తన సహనటుడు రణబీర్ కపూర్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న అలియా భట్ ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి అయిన కూడా సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా కొనసాగుతోంది. తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా ఎదిగి, భారీ పారితోషకాలను పొందుతున్న ఈ ముద్దుగుమ్మ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్‌తో రోమాన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం తల్లి అయినా తన ఫిట్నెస్, ఫ్యాషన్, అందంతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. నెటిజన్లు “తల్లి అయిన తర్వాత మరింత అందంగా మారింది” అని కామెంట్లు చేస్తున్నారు.
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. అసలు అలియాభట్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. కిర్రాళ్లు మెంటలెక్కిపోతారు. అసలు ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అమె యాక్టింగ్ పొటెన్షియల్ ఎలాంటిదో తెలియాలంటే ఒక్క గంగూభాయ్ కతియావాడి సినిమా చూస్తే సరిపోతుంది. అలియా భట్ తండ్రి మహేష్ భట్ ఫేమస్ డైరెక్టర్ కమ్ నిర్మాత. ఆమె తల్లి సోనీ రాజ్ నటి. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన నటి అలియా భట్ చదువు మానేసి 12వ తరగతి కూడా పూర్తి చేయకుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది..1999లో ‘సంఘర్ష్’ అనే హిందీ చిత్రం ద్వారా బాలనటిగా అలియా భట్ తెరంగేట్రం చేయగా, ఆ తర్వాత 2012లో కరణ్ జోహార్ నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిశ్రమకి పరిచయం అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

