చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చి టాప్ కమెడీయన్స్‌లో ఒకరిగా నిలిచారు ఆలీ. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ సినిమాలు,టీవీ షోస్‌తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన భార్య తమ ఇంటికి సంబంధించిన వీడియోని హోమ్ టూర్ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సెలబ్రిటీలు ఇళ్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు సెలబ్రిటీలు యూట్యూబ్ ఛానెల్లో తమ ఇళ్లకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఆలీ సతీమణి జుబేదా ..తమ పిల్లల బెడ్ రూమ్స్‌తో పాటు ఇంటిలోని అన్ని గదులను చూపించారు. ముఖ్యంగా ఆలీ ఉపయోగిస్తోన్న బీఎమ్‌డబ్ల్యూ కారు, జిమ్ ఏరియా, హోమ్ థియేటర్ కూడా చూపించారు.
ఆలీని చూస్తే చాలా డౌన్ టూ ఎర్త్లా కనిపిస్తారు. కాని ఇప్పుడు ఆయన ఇల్లు, వాడుతున్నకార్లు చూస్తే కళ్లు జిగేల్మనక మానవు. ఓ రూంలో తన సినీ జీవితంలో అందుకున్న అవార్డులు, ప్రముఖ సినీ తారలతో దిగిన ఫొటోలను చక్కగా అమర్చుకున్నారు. సకల సౌకర్యాలతో ఎంతో అందంగా ఉన్న అలీ ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.