Selfie Movie Trailer | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కోవిడ్‌కు ముందు వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్.. కోవిడ్ తర్వాత ఫామ్‌ను కోల్పోయాడు. కరోనా తర్వాత ఈయన నటించిన 9 సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెండు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. కాగా మిగిలిన ఏడింటిలో ఒక్కటి మాత్రమే కమర్షియల్‌గా హిట్ సాధించింది. మిగితావన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. దాంతో ఈయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ప్రస్తుతం అక్షయ్ అశలన్నీ ‘సెల్ఫీ’ సినిమా పైనే ఉన్నాయి.
రాజ్మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. సెలబ్రెటీ పాత్రలో అక్షయ్ నటించగా.. పోలీస్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ తెచ్చిపెట్టాయి. కాగా తాజాగా మేకర్స్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవటానికి వచ్చిన ఒక స్టార్ హీరోకు, అతని ఫ్యాన్ అయిన ట్రాఫిక్ పోలీస్ కు మధ్య జరిగే ఇగో వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ ను గమనిస్తే ఒరిజినల్ వెర్షన్ ను కాపీ పేస్టు చేసినట్లుంది. సీన్ టూ సీన్ ఏది మార్చకుండా అలానే దింపినట్లు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో అయినా అక్షయ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుష్రత్ భరుచ్చా, డయానా పెంటీ హీరోయిన్లుగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంస్థలతో కలిసి మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 24న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.